తెలంగాణలో ఆహార భద్రత కార్డు (FSC) కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి?

తెలంగాణ  ప్రభుత్వం అనేక రకాలైన సేవలను, పథకాలను ప్రజలకు అందిస్తోంది. అందులో కొన్ని పథకాలను,  ఆర్థికంగా బలహీనంగా ఉన్న APL, BPL, AAY. కుటుంబాలకు చేయూత అందించడానికి ఉద్దేశింపబడినవి. అలాంటి కుటుంబాలకి చెందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తారు , అలాంటి వాటిల్లో ఒకటి ఆహార భద్రత పథకం, ఈ పథకం పొందడానికి ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటారు.

ప్రభుత్వం వారి యొక్క దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి వారు నిజమైన అర్హులేనా? కాదా? అనే విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ అర్హులని తేలితే అలాంటి వారికి ప్రభుత్వం ఆహార భద్రత కార్డు జారీ చేస్తారు. తద్వారా వారు ప్రభుత్వ  పథకాలను పొందడానికి అర్హులుగా మారుతారు.

ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార ధాన్యాలు అందిస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. అయితే దేశంలో చాలా కుటుంబాలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. వారు రేషన్ కార్డులు పొందడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అలాంటి పథకాన్నీ పొందడానికి కావలిసిన అర్హతలు ఏమిటి, దానికికోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా.

అయితే, అన్ని రాష్ట్రాలు డిజిటల్ రేషన్ కార్డ్ సేవల వైపు మొగ్గు చూపుతున్నాయి. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ రేషన్ కార్డ్ సేవల వైపు అడుగు వేసింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విభిన్న సేవలను పొందడానికి ప్రజలు నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

రేషన్ కార్డ్ లు మూడు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది అవి ఏమిటంటే:

  • APL (Above Poverty Line)
  • BPL ( Below Poverty Line)
  • AAY (Anthyodaya Anna Yojana)   (Lower than BPL)

Ration Card in Telugu

కొత్త రేషన్ కార్డు పొందడానికి గల అర్హతలు Eligibility Criteria to Apply:

  • దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రనివాసి అయి ఉండాలి.
  • అభ్యర్థి ఇంతకు ముందు రేషన్ కార్డు లేదా FSC (Food Security Card) కార్డు కలిగి ఉండకూడదు.
  • దరఖాస్తుదారులు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి (BPL Family).
  • పాత రేషన్ కార్డులు (గడువు ముగిసిన కార్డులు) ఉన్న దరఖాస్తుదారు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు Required Documents:

  • యాక్టివ్ మొబైల్ నంబర్
  • వయస్సు రుజువు
  • గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు, ఓటరు ID, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ మొదలైనవి)
  • చిరునామా రుజువు (ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, నీటి సరఫరా బిల్లు,electricity bill రసీదు)
  • ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ఆన్లైన్ లో అప్లై చేసే ప్రొసీజర్ How to Apply Ration Card Online in Telangana?

  • తెలంగాణ మీసేవా పోర్టల్ యొక్క అధికారిక పోర్టల్ సందర్శించండి https://epds.telangana.gov.in.
  • హోమ్ పేజీలో, అప్లికేషన్ ఫారం క్లిక్ చేయండి.
  • కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కోసం అప్లికేషన్‌ను ఎంచుకుని, దానిపై క్లిక్ చేయండి.
  • ఒక విండో ఓపెన్ అవుతుంది అక్కడ న్యూ అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయండి.
  • ఆ ఫారం డౌన్లోడ్ చేసి, ప్రింటౌట్ తీస్కోండి.
  • కార్డు రకం, UID నంబర్, కుటుంబ పెద్ద పేరు, తండ్రి/జీవిత భాగస్వామి పేరు, లింగం, వయస్సు, మతం, బీసీ/SC/ST/OC/Minority ఎంచుకొని నింపండి .
  • గ్యాస్ కనెక్షన్ స్థితి, గ్యాస్ కంపెనీ పేరు, గ్యాస్ ఏజెన్సీ పేరు, వినియోగదారు సంఖ్య వంటి గ్యాస్ కనెక్షన్ వివరాలను నమోదు చేయండి.
  • డోర్ నం, ప్రాంతం, జిల్లా, మండలం, గ్రామం/వార్డ్, పిన్ కోడ్, FB షాప్ నంబర్, పూర్తి నివాస చిరునామా వివరాలను నమోదు చేయండి.
  • ఆధార్ నంబర్, EID, సభ్యుడి పేరు, SRDH పేరు వంటి వివరాలను నమోదు చేయండి.
  • ఫారం చివరలో, దరఖాస్తుదారుడి సంతకం చేయండి ,
  • అలాగే, మీరు దరఖాస్తు ఫారమ్‌తో జతచేయవలసిన పత్రాలను చూస్కోండి,
  • సమీప మీసేవా కేంద్రానికి వెళ్లి, దరఖాస్తు ఫారమ్‌తో పాటు పత్రాలను సమర్పించండి.
  • మీసేవా ఎగ్జిక్యూటివ్ అన్ని పత్రాలను తీసుకొని , మీకు రసీదుని అందజేస్తారు.
  • మీ రసీదులో దరఖాస్తు సంఖ్యను ఇవ్వడం ద్వారా మీసేవా అధికారిక పోర్టల్‌ లో  మీ యొక్క కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు,
  • అభ్యర్థులు అప్లికేషన్ స్థితి కోసం వారి మొబైల్ నంబర్‌ను ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు.
  • https://epds.telangana.gov.in అధికారికా వెబ్సైటు లో స్టేటస్ చెక్ విత్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మీ FSC స్టేటస్ తెలుసుకోవచ్చు.

సో, ఫ్రెండ్స్ అర్హతలు ఉండి ఎవరికైనా FSC (Food Security Card) కార్డు లేకుంటే త్వరగా ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఈ కార్డు పొందండి, మీ భవిష్యతవాసరాలకు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెల్ల రేషన్ కార్డుదారులు సబ్సిడీ రేట్లపై ఆహారం మరియు ఆహార ధాన్యాలను పొందవచ్చు.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఉచిత వైద్య సహాయం పొందడంలో వైట్ రేషన్ కార్డులు కూడా సహాయపడతాయి. వారు తరచుగా ఆస్తి లావాదేవీలు మరియు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చు.

Share:FacebookX
Join the discussion