SADERAM అంటే ఏమిటి – దాన్ని ఎలా అప్లై చేయాలా?

SADERAM అంటే ఏమిటి……?SADERAM సర్టిఫికెట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో తెలియడం లేదా !! అయితే ఇ పోస్ట్ లో పూర్తి వివరాలు పొందవచ్చు ………….!!!

మొదటగా మనం SADERAM అంటే ఏమిటి తెలుసుకుందాం, ఇది ఒక సాఫ్ట్వేర్ (Software Assessment Of Disabled For Acsses Rehabilation & Empowerment) వైకల్యాన్ని అంచనా ,పునరావాసం ,సాధికారతకు యి సాఫ్ట్వేర్ పనిచేస్తుంది.

మనం నివసిస్తున్న సమాజంలో చాలామంది వికలాంగులను మనం చుస్తూఉంటాం, వారిని చుస్తే జాలి, దయా కలుగుతుంది. వారిలో సామజిక, ఆర్థికా, సాంస్కృతిక, మానసిక అడ్డాఓకులను అధిగమించడానికి వారికి వనరులపై పూర్తి సామర్థ్యం కల్పించడానికి వారి జీవన స్థితిగతులను కొంత మేరకు మార్చడానికి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

వైకల్య౦ అనేక రకాలుగా ఉంటుంది అవి మానసిక వైకల్యం, శారీరక వైకల్యం, వినికిడి లోపం, కంటి రుగ్మతలు మొ,,వి… ఇలాంటి వైకల్యాల్ని మొత్తంగా 21 రకాలుగా గుర్తించారు వీరికి తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం SADERAM మరియు SERP ( సాఫ్ట్వేర్ ఫర్ ఎలిమినేషన్ రురల్ పావర్టీ) లాంటి ద్వారా వికలాంగుల ఆర్థిక ,సామజిక భద్రత కొరకై పనిచేస్తుంది. తెలంగాణ లో పంచాయతీరాజ్ & రురల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సదేరం నిర్వహిస్తుంది.

Telangana Sadarem
SADERAM సర్టిఫికెట్ పొందడానికి గల డాకుమెంట్స్ రెడీ చేసుకోండి: 
  • తెలంగాణ వాసి
  • ఆధార్ కార్డు
  • వైట్ రేషన్ కార్డు
  • ఫోటో
  • ఫోన్ నెంబర్

17  సంఖ్య గల వైకల్య నిర్ధారణ ధ్రువపత్రం పొందడానికి మొదట మీరు పై పేర్కొన్న డాకుమెంట్స్ తీసుకొని మీ సేవ కేంద్రానికి వెళ్లి మీ స్లాట్ బుక్ చేసుకోవాలి ,దీనిని మొదట ఎంపీడీఓ ఆఫీస్ లో ఇచ్చేవారు ఇప్పుడు మీ సేవ కు అనుసంధించారు.

మీ సేవ లో స్లాట్ బుక్ అయ్యాక వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు దానిలో సదరం క్యాంపు  ఏ హాస్పిటల్ లో, ఏ డేట్, ఏ వారం నిర్వహిస్తరో  వివరంగా ఉంటుంది. కాబట్టి నిర్దేశించిన తేదీన మీరు మీసేవ రిసీట్ మరియు మీ ఆధార్ కార్డు తీసుకోని ఉదయం తొమ్మిది గంటల కు చేరుకోవాలి.

అక్కడ సంబంధిత డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి ఆన్లైన్ లో వైకల్య వివరాలను నమోదు చేసి మీకు ధ్రువ పత్రం జారీ 15 రోజులలో  జారీ చేస్తారు,  గుర్తుంచుకొండి మీకు ఉన్న వైకల్యం 40  శాతానికి పైగా ఉంటేనే మీరు యి సర్టిఫికెట్ తీసుకోవడానికి అర్హులు అనే విషయం మర్చిపోకండి.

మీకు సర్టిఫికెట్ వచ్చాక నేరుగా పెన్షన్ కొరకై మీరు దరఖాస్తు చేసుకోగలరు. ఒకవేళ మీకు పరీక్షా చేసాక వైకల్యం  40  శాతానికి తక్కువ వస్తే మల్లి మీరు డిస్టిక్ మెడికల్ బోర్డు కు నిర్ణిత దరఖాస్తు చేసి రాష్ట్ర అప్పిలేట్ వెళ్లవలిసి వస్తుంది. ఇప్పటి వరకు తెలంగాన లో 794362  మందిని వికలాంగులుగా  గుర్తించి వారికి నెల నెల పెన్షన్ అందిస్తుంది.

నోట్: ఎవరైనా అనర్హులు సదరం సర్టిఫికెట్ పొందారు అని రుజువైతే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఇరవై వేల జరిమానా విధించబడుతుంది కొన్ని సార్లు రెండు విధిస్తారు సో బి కేర్ ఫూల్.

సో, ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం మీ దెగ్గర సదేరం క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకొని మీకు తెలిసిన వారికి ఇలా సదేరం సర్టిఫికెట్ పొందడానికి సహాయం చేయండి.

Telangana సదరెం స్థితిని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

తెలంగాణ (Telangana) వాసి తెలంగాణ ప్రభుత్వం వారి www.sadarem.telangana.gov.in వెబ్సైట్ కి వెళ్లి మీ సదరం సర్టిఫికెట్ స్టేటస్ చుస్కో వచ్చు.

ఆన్లైన్ లో స్టేటస్ చుస్కో డానికి మీ దిగారు SADAREM ID లేదా Pension Number ఉండాలి.

AP Sadarem

AP (Andhra Pradesh) సదరెం స్థితిని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

Andhra Pradesh వాసి AP ప్రభుత్వం వారి వెబ్సైట్ https://sadarem.ap.gov.in/ కి వెళ్లి మీ సదరం సర్టిఫికెట్ స్టేటస్ చుస్కో వచ్చు.

ఆన్లైన్ లో స్టేటస్ చుస్కో డానికి మీ దిగారు SADAREM ID లేదా Pension Number ఉండాలి.

ఆంధ్ర ప్రదేశ్ సదరెం Camp స్థితిని చుస్కో డానికి కింద ఇచినా లింక్ కి ఎల్లండి.
Share:FacebookX
Join the discussion