తెలంగాణలో ఆదాయ ధ్రువపత్రo ఆన్లైన్ లో పొందడం ఎలా?

తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన సేవలను, పథకాలను ప్రజలకు అందిస్తోంది. అందులో కొన్ని పథకాలను, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు చేయూత అందించడానికి ఉద్దేశింపబడినవి. అలాంటి కుటుంబాలకి చెందిన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని పత్రాలను జారీ చేస్తుంది. ఆలాంటి పత్రాలను పొందడానికి ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటారు.

ప్రభుత్వం వారి యొక్క దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి వారు నిజమైన అర్హులేనా..? కాదా ..? అనే విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ అర్హులని తేలితే అలాంటి వారికి ప్రభుత్వం కొన్ని పత్రాలను జారీ చేస్తారు. తద్వారా వారు ప్రభుత్వ సేవలను, ప్రభుత్వ పథకాలను పొందడానికి అర్హులుగా మారుతారు. అలాంటి కొన్ని ప్రభుత్వాలు జారీ చేసే పత్రాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • కుల ధ్రువ పత్రం (Caste Certificate)
  • ఆదాయ ధ్రువపత్రం (Income Certificate)
  • నివాస ధ్రువపత్రం (Residential Certificate)
  • జనన ధ్రువపత్రం (Birth Certificate )
  • మరణ ధ్రువపత్రం (Death Certificate) మొదలగునవి

Income Certificate in Telugu

ఆదాయ ధ్రువపత్రo ఆంటే ఏమిటో తెలుసుకుందాం?

ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఆంగ్లంలో Income Certificate అని అంటారు. ఇది ఒక ప్రభుత్వ పత్రం, ఒక వ్యక్తి లేదా కుటుంబ ఆదాయం యొక్క అన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఉన్న ఆస్తిపాస్తులు ,సంవత్సర ఆదాయం, మొదలైనవి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆదాయ ధ్రువపత్రం అందిస్తుంది.

అర్హత ఉన్న విద్యార్థులకు EAMCET, ICET, ECET, EDCET మరియు PGECET వంటి కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకి కూడా కొన్ని పథకాల కింద ఆదాయ ధృవీకరణ పత్రం కూడా అవసరం ఉంటుంది.

దీనితో పాటు, విద్యార్థులు తమ డిగ్రీలను కొనసాగించడానికి Scholarship పొందడానికి Income Certificate అవసరం. తెలంగాణ రాష్ట్రoలో నివసిస్తున్న ప్రజలందరూ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. తెలంగాణ ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం!

ఆదాయ ధ్రువపత్రాలు పొందడానికి కావలసిన ఇతర డాక్యుమెంట్స్:

  • అప్లికేషన్ ఫామ్ (Meeseva లేదా Online నుండి Download చేసుకోవచ్చు)
  • ఇద్దరూ గెజిటెడ్ ఆఫీసర్ ల నుండి ధ్రువీకరణ.
  • ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయం నుండి.
  • బోనఫైడ్ సర్టిఫికెట్ స్టాంప్ మరియు సిగ్నేచర్.
  • పది రూపాయల నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ సెల్ఫ్ సర్టిఫికేషన్ తో.
  • అడ్రస్ ప్రూఫ్. (Voter Id, Ration Card, Electricity Bill).
  • ఆధార్ కార్డు.

అర్హతలు Eligibility:

  • దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి
  • తెలంగాణ నివాసి అయి ఉండాలి

రుసుములు Fees:

  • అప్లికేషన్ ఫారం 10 రూపాయలు
  • అప్లికేషన్ & సబ్మిషన్ 35 రూపాయలు ( మీసేవ లో)

చెల్లుబాటు Validity:

  • ఒక సంవత్సరం పాటు

ఆదాయ పత్రం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం?

• అప్లికేషన్ ని 10 రూపాయలు చెల్లించి మీ సేవలో పొందగలరు.

• అప్లికేషన్ online నుండి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

• దరఖాస్తుదారు అప్లికేషన్ ని పూర్తిగా నింపి కావలసిన ఇతర పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది.

• దరఖాస్తుదారు సంతకం లేదా సంరక్షకుని సంతకం చేయాలి.

• మీసేవ కి వెళ్లి మీ application form మీ సబ్మిట్ చేయండి.

• మీ సేవ ఆపరేటర్ online process స్టార్ట్ చేయడం జరుగుతుంది.

• దరఖాస్తుదారుడి రిజిస్టర్ అయిన mobile phone కు మెసేజ్ రూపంలో transaction ID & application number వస్తుంది.

• MRO ( Mandal Revenue Officer) (తహసిల్దార్) Online Details ని Process చేస్తారు.

• VRO (Village Revenue Officer) దరఖాస్తుదారుని వెరిఫై చేసుకుంటాడు.

• దరఖాస్తుదారులు అప్లికేషన్ నెంబర్ లేదా ట్రాన్సాక్షన్ ఐడి తో క్రింద తెలిపిన లింకు ద్వారా ఇన్కమ్ సర్టిఫికెట్ స్టేటస్ తెలుసుకోవచ్చు (http://tg.meeseva.gov.in).

• MRO లేదా తహసీల్దార్ యొక్క ఆమోద ముద్ర వేస్తే మీకు మీ సేవ నుండి Income Certificate జారీ చేయబడుతుంది.

సో ఫ్రెండ్స్, పైన తెలిపిన విధంగా మీరు ఆదాయ ధ్రువపత్రo కొరకు అప్లై చేసినట్లు అయితే వారం నుండి పది రోజుల వ్యవధిలో మీరు ఆదాయ ధ్రువ పత్రం పొందుతారు. రాబోయే అవసరాలకై మీరు online ద్వారా Income Certificate తీసుకోవడం మంచిది. మీకు తెలిసిన వారికి ఎవరికైనా Income Certificate ఎలా పొందాలో తెలియకపోతే వారికి సహాయం చేయండి.

Share:FacebookX
Join the discussion