ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటే ఏంటి? దీనికి ఎలా అప్లై చేయాలి?

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి ఏం జె ఏ వై ) అని కూడా అంటారు. ఈ స్కీమ్ ఆర్ధికంగా బలహీనంగా ఉన్న భారతీయులకోసం మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అవసరం ఉన్న వారికోసం ఉపయోగ పడుతుంది.  

మన ప్రధానమంత్రి ఈ ఆరోగ్య భీమాను 23 సెప్టెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ భీమా సుమారు 50 కోట్ల భారత పౌరులకు అందుబాటులో ఉంటుంది. రిపోర్టుల ప్రకారం ఇప్పటివరకు 18,059 హాస్పిటల్స్ ఏంచుకోబడ్డాయి మరియి 4,406,461 లక్షల బెనెఫిషరీస్ ను అడ్మిట్ చేసారు. 10 కోట్ల  వరకు e-  కార్డులు ఇవ్వబడ్డాయి.

ఈ యోజన ప్రథమ ఉద్దేశం ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ పూర్తిగా నగదు రహితo చేయడమే. ఈ పధకం ఉన్నవారికి ఒక e- కార్డు ఇవ్వబడును. ఈ కార్డు ఉపయోగించి దీనికి సంబంధించిన ఏ హాస్పిటల్ లో అయినా, ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆసుపత్రి కైనా నేరుగా వెళ్లి నగదు రహిత చికిత్సని పొందవచ్చు.

దీంట్లో 3 రోజుల ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చు మరియు 15 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చు కవర్ చేయబడుతుంది. ఈ యోజన ఉన్నవారు చేతిలో డబ్బు లేకున్నా తమ ఆరోగ్య చికిత్సలు చేయించుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు అప్లై చేసే విధానం:

  • https://www.pmjay.gov.in/ కి వెళ్లి నేను అర్హుడినేనా అని క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చ ఎంటర్ చేసి జెనెరేట్ ఓటీపీ క్లిక్ చేయండి.
  • తరువాత మీ మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రాష్ట్రం  పేరు ఎంటర్ చేసి సర్చ్ చేయండి.
  • మీకు వచ్చిన ఫలితాల ద్వారా మీయొక్క కుటుంబానికి పి ఏం జె ఏ వై స్కీమ్  వర్తిస్తుందో లేదో మీరు  తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *