ఆన్లైన్ లో PNR స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

ఆన్లైన్ లో PNR స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

ఈ రోజు అత్యంత మంది  ప్రజలకు చేరువలో ,చవకగా ప్రయాణించడానికి వీలుగా ఉండే ప్రయాణ సాధనం ఏదైనా ఉంది అంటే అది రైలు  ప్రయాణం అని టక్కున చెప్పేయవచ్చు , భారతదేశం లో ఇండియన్ రైల్వేస్ యొక్క ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బ్రిటిష్ కాలం నుండి ఇప్పటివరకు యి రైల్వే మనకు ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది.

మనలో చాలామంది కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటాం, ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందామా. అయితే ఎందుకు ఆలస్యం చదవండి పూర్తిగా !

ఇండియా లో మొదటి రైలు నడిచింది  22.12.1851  లొ ముంబై నుండి థానే వరకు ,భారతదేశంలో ప్రజలు దూర ప్రయాణాలకు అత్యధికంగా రైలు మర్గాలనే ఆశ్రయిస్తారు. ప్రతి సాధారణ ప్రయాణీకుల రైలులో సుమారుగా పద్దెనిమిది బోగీలు ఉండగా ప్రజాదరణ పొందిన రైళ్ళలో ఇరవై నాలుగు బోగీల వరకూ ఉంటాయి.

ఈ బోగీలు పద్దెనిమిది నుండి డెబ్బైరెండు మంది ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయబడ్డాయి, అయితే రద్దీ సమయాలలో ఈ భోగీలలో అంతకంటే చాలా ఎక్కువ మంది కూడా ప్రయాణం సాగించవచ్చు. ఈ బోగీలలో ఎక్కువ భాగం ఒక దానికి మరొకటి అనుసంధానించబడి ఒక దాని నుండి మరొక దానికి మారేందుకు వీలుగా ఉంటాయి.

IRCTC (Indian Railway catering and tourism corporation) ముఖ్యoగా  పలురకాల రైల్వే లు నిర్వహిస్తుంది అవెమంటే:-

 • పాసింజర్ రైలు (Passenger train)
 • ఫాస్ట్ పాసింజర్ రైలు (Fast Passenger train)
 • సూపర్ ఫాస్ట్ పాసింజర్ రైలు (Super Fast   Passenger train)
 • ఎక్స్‌ప్రెస్ రైలు (Express train)
 • సరుకుల రైలు (Goods train) etc.

ఇప్పుడు మనం PNR  అంటే ఏమిటి, ఆన్లైన్లో  ఎలా సెర్చ్ చేయలి,  అసలు అది ఎలా లభిస్తుంది ,దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా.

మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్లవలిసి వస్తే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా , అలాగే రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కూడా మనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి లేదా రైల్వే స్టేషన్ లో ఐన టికెట్స్ తీసుకోవాలి అవునా ..!! అయితే ఇప్పుడు మనo  PNR  గురించి వివరంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం.

PNR అంటే ఏమిటి (What is PNR)?

PNR   అనగా పాసెంజర్ నేమ్ రికార్డు ( Passenger Name  Record )  ఇది 10  అంకెలు గల కోడ్, మనం టికెట్స్ తీసుకున్నప్పుడు  ఆ టికెట్ ని కొంచెం పరీక్షిస్తే left  side  top  corner  లో మనకు ఒక 10 అంకెల  కోడ్ కనిపిస్తుంది అదే  PNR  కోడ్ అంటే…

ఇండియన్ రైల్వేస్ రైలు టికెట్‌లో 10 అంకెల నంబర్ ఉంటుంది  మరియు మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా టికెట్ కౌంటర్‌లో రైలు టికెట్ బుక్ చేసినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది.

మీరు భారతీయ రైల్వే రైలులో మీ ప్రయాణానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు.    మీరు రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత, సెంటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) దానిని 9 నెలలు నిల్వ చేసి, ఆపై దాన్ని తొలగిస్తుంది.

PNR Status in Telugu

PNR స్టేటస్ ని ఆన్లైన్ లో తెలుసుకోవడం ఎలా How to Know Your PNR Status Online?

 • అయితే ముందుగా చేయాల్సింసిదేమనగా Indian railways official website www.irctc.co.in ను ఓపెన్ చేయాలి.
 • PNR status బటన్‌పై క్లిక్ చేయండి.
 • మీ 10 అంకెల PNR నంబర్‌ను నమోదు  మరియు search చేయండి.
 • ప్రయాణీకుల వివరాలతో పాటు మీరు బుక్ చేసుకున్న టికెట్ ప్రస్తుత స్థితిని పొందుతారు.

PNR (Passenger Name Record) లో ఏ సమాచారం ఉంటుంది?

ఒక PNR నం. కింది సమాచారాన్ని కలిగి ఉంది:

ప్రయాణీకుల వివరాలు, ఇందులో పేరు, వయస్సు మరియు లింగం ఉన్నాయి. రైలు నంబర్, కోచ్ మరియు సీటు నంబర్లు, ప్రయాణ తరగతి మరియు బయలుదేరే స్టేషన్ వంటి రైలు వివరాలు. టిక్కెట్ వివరాలు, ఇందులో చెల్లింపు విధానం, లావాదేవీ ID మరియు ఛార్జీలు ఉంటాయి.

అంతే కాకుండా  PNR  లో  ఉండే వివిధ సంక్షిప్త రూపాలు  కూడా మనం తెలుసుకోవచ్చు  అవి

 • CNF    టికెట్ కంఫర్మ్
 • RAC    reservation  against
 • Cancellation
 •     వెయిటింగ్ లిస్ట్
 • జనరల్ వెయిటింగ్ లిస్ట్
 • TQWL   తత్కాల్ వెయిటింగ్ లిస్ట్
 • NOSB   నో సీట్ బెర్త్
 • CAN       కాన్సల్

అని వివిధ సంక్షిప్త సమాచారాన్ని మనం PNR స్టేటస్ లో తెలుసుకోవచ్చు.

PNR నంబర్ వల్ల ప్రయోజనం ఏమిటి what are the benefits of PNR?

మీ PNR నంబర్ చెప్పడం ద్వారా మీరు మీ సీటుకి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. మీరు గదులు మరియు వసతి గృహాలను బుక్ చేసుకోవచ్చు మరియు వాటిని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరలకు పొందవచ్చు.

సో , ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీకు ఇష్టమైన , నచ్చిన ప్రదేశాలను చూడటానికి వెళ్లాలనుకుంటున్నారా… అయితే ఐ ఆర్ సి టి సి అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయిపోయి మీ  మీయొక్క టికెట్స్ ని బుక్ చేసుకోండి తరువాత పైన తెలిపిన విధంగా PNR స్టేటస్ లు కూడా ఈజీగా ఇంటి వద్ద నుండి ఆన్లైన్లో చక్కగా చూసుకోండి  మీకు కావలసిన సమాచారాన్ని PNR స్టేటస్ గురించి పూర్తిగా వివరించామని ఆశిస్తున్నాను.

హ్యాపీ జర్నీ…

ప్రయాణికుల క్షేమమే మా అత్యంత ప్రాధాన్యత గల విషయం IRCTC.

Join the discussion