వై.యస్.ఆర్ విద్యోన్నతి పథకం YSR Vidyonnathi Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అనేక అభివృద్ధి పథకాలను సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రారంభించడం జరిగింది. తద్వారా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను కొంతవరకైనా రూపుమాపడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

సమాజంలో ఉన్న SC, ST ,BC, Minority, EBC వర్గాల లోని పేదవారికి విద్య, వైద్య రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చాలని ప్రభుత్వం ప్రత్యేకంగా వారి పై దృష్టి సారించింది.  శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి  చదువు ఒక్కటే మార్గమని, బలహీన వర్గాల పిల్లలకు చక్కని విద్య అందించడం ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యమని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెంపొందింప చేయాలని సంకల్పించారు. పేద ప్రజలు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందులో ఒకటి వైయస్సార్ విద్యోన్నతి పథకం.

వై.యస్సా.ర్ విద్యోన్నతి గా ఉన్న ఈ పథకం పేరు మార్చి వైయస్సార్ విద్యోన్నతి పథకం గా తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల పై చదువులకు ఆర్ధిక తోడ్పాటు అందించడం. అందులో ముఖ్యంగా UPSC పరీక్ష రాసే విద్యార్థులు కోసం వారికి కొంత మేరకు ఆర్థికపరమైన సహాయం చేయడం ద్వారా బలహీన వర్గాల పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి ఐఏఎస్ ,ఐపీఎస్ లుగా మారి సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేస్తారని  ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.

వైయస్సార్ విద్యోన్నతి పథకం గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

వైయస్సార్ విద్యోన్నతి పథకం 2015లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైన అభ్యర్థులు UPSC ప్రిలిమ్స్ మరియు MAINS పరీక్షలు రాసే వారికి  ప్రభుత్వం తరపున స్కాలర్షిప్  అందజేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ పొందడానికి ఉండాల్సిన అర్హతలు, ప్రయోజనాలు, సెలక్షన్ ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లికేషన్ చేసుకునే విధానానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

YSR Vidyonnathi Scheme

YSR విద్యోన్నతి పథకం పొందానికి కావలసిన అర్హతలు YSR Vidyonnathi Scheme Eligibility Criteria:

 • విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
 • దరఖాస్తుదారు గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి/ ఏదైనా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చివరి సంవత్సరంలో ఉండాలి.
 • విద్యార్థి తప్పనిసరిగా SC/ ST, BC, కాపు, మైనారిటీ, బ్రాహ్మణ లేదా EBC కమ్యూనిటీకి చెందినవాడై ఉండాలి.
 • అభ్యర్థి వార్షిక కుటుంబ ఆదాయం INR 6,00,000 మించకూడదు.
 • UPSC మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల వయస్సు పరంగా తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
 • అతను/ ఆమె తప్పనిసరిగా విద్యోన్నతి స్కాలర్‌షిప్ పథకంలో పేర్కొన్న గరిష్ట వయో పరిమితిని కలిగి ఉండాలి.
 • ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల ద్వారా ప్రయోజనం పొందుతున్న అభ్యర్థులు స్కాలర్‌షిప్ పథకానికి అర్హులు కాదు.

ప్రయోజనాలు Benefits of the scheme:

 • 9 నుండి 12 నెలల వరకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ శిక్షణా కోర్సు కోసం 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయంగా మంజూరు చేయబడుతుంది.ఈ మొత్తం నేరుగా సంస్థ ఖాతాలో జమ చేయబడుతుంది.
 • ఎంపికైన అభ్యర్థులు పుస్తకాలు, స్టేషనరీ, బస మొదలైనవాటిని కొనుగోలు చేయడానికి అలవెన్స్‌గా 9 నెలలకు 10,000 రూపాయలు పొందడానికి అర్హులు.
 • ఒక్కొక్క విద్యార్థికి 2౦౦౦ రూపాయలు  వన్‌టైమ్ ట్రావెల్ అలవెన్స్ మొత్తం కోర్సు కాలానికి సివిల్ సర్వీస్ కోచింగ్‌గా చెల్లించబడుతుంది.
 • న్యూఢిల్లీలో UPSC పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం, AP భవన్‌లో వసతి కోసం కొంత మొత్తం చెల్లిచాలి.

స్కాలర్‌షిప్ కోసం ఎలా  దరఖాస్తు చేయాలి How to Apply for Scheme?

 • వైస్సార్ విద్యోన్నతి పథకం official website సందర్శించండి.
 • ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
 • అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి.
 • అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
 • వివరాలను సరిచూసుకోండి.
 • Submit బటన్ క్లిక్ చేయండి.
 • వివరాలు సేవ్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
 • Acknowledgement తీసుకోండి.

ఇతర డాకుమెంట్స్ Required Documents:

 • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
 • కుటుంబ ఆదాయం సర్టిఫికేట్
 • కుల ధృవీకరణ పత్రం
 • ఆధార్ కార్డ్ కాపీ
 • జనన ధృవీకరణ పత్రం
 • డిగ్రీ లేదా సమానమైన పాస్ మార్క్ షీట్
 • స్కాన్ చేసిన అభ్యర్థి సంతకం
 • వికలాంగ విద్యార్థులకు వైకల్యం సర్టిఫికేట్
 • బ్యాంక్ పాస్ బుక్ కాపీ

ఎంపిక ప్రక్రియ  Selection Process:

 • మొదటి దశ కోసం ప్రవేశ పరీక్ష ఉంటుంది.
 • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఆసక్తిగల అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలి.
 • ఎంపిక ప్రక్రియ రిజర్వేషన్లు మరియు కట్-ఆఫ్ మార్కుల ఆధారంగా ఉంటుంది.
 • వైస్సార్ విద్యోన్నతి యొక్క మెరిట్ జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడుతుంది.
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరిట్ విద్యార్థులను వివిధ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లలోకి పంపుతుంది.

చెల్లింపు విధానం Payment Mode:

అభ్యర్థికి కోచింగ్ ఫీజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తుంది, ఇన్స్టిట్యూట్ నుండి విద్యార్థి నివేదిక చుసాక ఫీజు యొక్క మొదటి విడత అందించబడుతుంది. కోచింగ్ పూర్తయిన తర్వాత రెండవ విడత ఇవ్వబడుతుంది.

సంప్రదింపు వివరాలు Contact Details:

 • ఫోన్ నంబర్: 7331172075, 7331172076
 • టోల్ ఫ్రీ: 08645-274025
 • ఇమెయిల్ ID: apkwdc@gmail.com

సో ఫ్రెండ్స్, మీరు కానీ, మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ ఉన్నత విద్యను  అభ్యసించాలి అనుకుంటే UPSC (Union Public Service Commission) ఎగ్జామ్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ లుగా స్థిరపడాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఈ స్కాలర్ షిప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

Share:FacebookX
Join the discussion

1 comment