వికారాబాద్ అనంతగిరి హిల్స్ సాహస కృత్యాల ప్రయాణం Vikarabad Adventures Journey

తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం టూరిజం అభివృద్ధి కొరకై తగిన ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నది.హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్ మొదలగు, ప్రాంతాలలో టూరిస్ట్ స్పాట్  చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించాయని చెప్పుకోవచ్చు TSTDC (Telangana State Tourism Développent Corporation) తెలంగాణలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను, నిర్మాణాలు, కోటలు, జలపాతాలు అడవులు, మరియు దేవాలయాలు అభివృద్ధి పరిచి తద్వారా తెలంగాణలో టూరిస్ట్ ప్రదేశాలు వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.

అలాంటి వాటిలో ముఖ్యమైనవి చార్మినార్, గోల్కొండ కోట, భువనగిరి కోట, కాకతీయ తోరణం, వేయి స్తంభాల గుడి, మెదక్ చర్చ్, నల్లమల ఫారెస్ట్, ఇలాంటివి చాలా అందమైన ప్రదేశాలు  దినదినం వందలాది, వేలాది మంది ఇక్కడికి రావడం వల్ల తెలంగాణ టూరిజం శాఖ అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి వాటిలో సాహసకృత్యాలు లకు పెట్టింది పేరుగా వికారాబాద్ అనంతగిరి కొండలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా అయితే ఎందుకు ఆలస్యం ఈ పోస్ట్ ని  పూర్తిగా చదవండి.

వికారాబాద్ “అనంతగిరి హిల్స్” ఈ పేరు పేదవాడి ఊటీ గా ప్రసిద్ధి. ఇది దక్షిణ తెలంగాణలో హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో , వికారాబాద్ జిల్లా కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాహసకృత్యాలు ఇష్టపడేవారికి ఈ అనంతగిరి అనువైన ప్రదేశమని చెప్పుకోవచ్చు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి ఈ కొండలే ప్రధాన నీటి వనరు, తెలంగాణ ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఒకటిగా వికారాబాద్ ఫారెస్ట్ పరిగణించడం జరుగుతుంది. మూసీ నది యొక్క జన్మస్థలం కూడా ఈ అనంతగిరి కొండల్లోనే ఉంది.

ఇది ఎర్ర మట్టితో కప్పబడి ఉండటం చేత కొన్ని సాహస క్రీడకు అనువైన ప్రదేశంగా ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులు భావిస్తుంటారు. అనంతగిరి కొండ వైపు వెళ్తున్నప్పుడు రోడ్డు ఇరువైపులా ఉండే చెట్లు, పచ్చదనం చూడముచ్చటగాఉంటుంది. కొద్దిగా చినుకులతో ఆకాశం మేఘావృతమై న రోజున ఈ వికారాబాద్ పర్యటనకు వస్తే గనక అది ఒక మరుపురాని దృశ్యంగా అలా మన కళ్ళలో శాశ్వతంగా ఉండిపోతుంది.

వారం మొత్తం వారివారి పనులతో బిజీగా ఉండే జనాలు వారాంతంలో హైదరాబాద్ నుండే కాక వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఈ అనంతగిరి హిల్స్ కి రావడం జరుగుతుంది. చిన్న జలాశయం, దట్టమైన అడవిలో ప్రయాణం, పెద్దపెద్ద వృక్షాలు, అందమైన ప్రదేశాలు నడుమ మన నడక ప్రయాణం కొనసాగిస్తుంటే, అబ్బో ……!

నిజంగా అది ఒక గొప్ప అనుభూతి మాటల్లో వివరించలేని జ్ఞాపకం గా ఉండిపోతుంది అయితే ఈ అనంతగిరి హిల్స్ ఎలా చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటి, చూడడానికి ఉన్న అనువైన ప్రదేశాలు ఏమిటి, మొదలగునవి తెలుసుకోవాలనుకుంటున్నారా కదా అయితే పదండి  తెలుసుకుందాం!

ప్రదేశం : Anantagiri Hills, Telangana, 501102

ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ నుండి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉంటుంది. వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి పది కిలోమీటర్లు సొంత వాహనం, టాక్సీ లేదా బస్సులో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. దూరప్రాంతాల నుంచి వస్తున్న వారైతే రైలు ప్రయాణం ఉత్తమంగా చెప్పవచ్చు.

చూడవలసినవి?

  • అనంత పద్మనాభ స్వామి పురాతన దేవాలయం
  • హిల్ వ్యూ పాయింట్
  • మూసీ నది జన్మస్థలం
  • గుహలు
  • కోటిపల్లి రిజర్వాయర్ సూర్యాస్తమయ సమయం
  • బోటింగ్
  • పార్క్ trecking
  • మొదలగునవి చూడడానికి చూడముచ్చటగా ఆహ్లాదంగా ఉంటాయి.

సౌకర్యాలు Facilities:

  • అనంతగిరి హిల్స్ స్టేషన్ లో కొన్ని రిసార్ట్ లు ఉన్నాయి.
  • అవి, హరిత హరిత వ్యాలీ రిసార్ట్.
  • డెక్కన్ ట్రైల్స్ రిసార్ట్స్.

ఉషోదయ రిసార్ట్స్ ……మొదలగు రిసార్ట్స్ అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం నిర్వహించడం జరిగింది. ఒక కుటుంబానికి రోజుకి దాదాపు పదిహేను వందల రూపాయలు ఈ రిసార్ట్ లో చార్జ్ చేయబడుతుంది.కావాలనుకుంటే మన సొంతంగా గుడారాలు ఏర్పాటు చేసుకుని అక్కడ బస చేయవచ్చు.

సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, వికారాబాద్ అనంతగిరి హిల్స్ ఎలా చేరుకోవాలో అయితే అక్టోబర్ నుండి మార్చి మధ్యలో ఈ ఫారెస్ట్ ని సందర్శిస్తే ప్రకృతి మరింత అందంగా , సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకనగా ఇది వింటర్ సీజన్ అప్పుడు ఈ హిల్స్ చూడ చక్కగా, అందంగా, ప్రకృతి రమణీయంగా కనబడుతుంది.

ఇంకా మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో గానీ, మీ కుటుంబంతో గానీ, సరదాగా దగ్గర్లో ఉన్న Destination కి వెళ్ళాలి అనుకుంటే తప్పక అనంతగిరి హిల్స్ కి వెళ్ళండి. మీరు ప్రకృతి ప్రేమికులు అయినట్లయితే ఆ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఒకే ఫ్రెండ్స్ మీరు ప్రకృతిని ప్రేమిస్తూ,, ప్రకృతి తో జీవిస్తూ హాయిగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ.

Share:FacebookX
Join the discussion