హైదరాబాద్ టాప్ 10 జ్యువలరీ షాప్స్: హైదరాబాద్‌లో ఉత్తమ నగల దుకాణం ఏది?

ప్రతి ఒక్కరికి బంగారం మరియు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టం. బంగారు, డైమండ్ ఆభరణాలు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. బంగారు ఆభరణాలు అనగానే నాణ్యత, నమ్మకం, పనితనం తప్పక చూడాల్సిందే.

ఖరీదుతో కూడినది కాబట్టి కొనేముందు ఏ జ్యువలర్స్ నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలు ఇస్తున్నారు అని ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అందుకే మీకోసం హైదరాబాద్ లోని టాప్ 10 జ్యువలరీ షాప్స్ వివరాలను మీకు అందచేస్తున్నాము. మీరు బంగారు ఆభరణాలు కొనేటప్పుడు ఈ షాప్స్ లోని ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

లిస్ట్ అఫ్హై హైదరాబాద్ టాప్ 10 జ్యువలరీ బ్రాండ్స్:

Mangatrai Jewellers

1. మంగత్రాయ్ జ్యువెలర్స్ (Magatrai):

1905 సం.లో మంగత్రాయ్ ప్రముఖ చార్మినార్ ప్రాంతంలో జ్యుపెరల్స్ జ్యువెలరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ డిజైన్లు, అదునాతనమైన మరియు సంప్రదాయ శైలితో కూడిన ఆభరణాల సేకరణను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా విలక్షణమైన బంగారు మరియు వజ్రాల ఆభరణాలను వీరు కస్టమర్స్ కి అందిస్తున్నారు.

 • ఫోన్ నెం: 04023411816
 • ఇమెయిల్: darpan@mangatrai.com
 • వెబ్సైట్: https://www.mangatrai.com
 • చిరునామా: పంజాగుట్ట, చౌరస్తా, హైదరాబాద్-500 082

 

Khazana Jewellery

2. ఖజానా జ్యువలరీ (Khazana Jewellery):

1989లో, మిస్టర్ కిషోర్ కుమార్ ప్రతి మహిళను ఆకార్షించే సున్నితమైన ఆభరణాలను రూపొందించడం ద్వారా ఖజానా స్థాపించబడింది. ఖజానా అంటేనే ఒక బ్రాండ్. NSC బోస్ రోడ్లో మొదటి షోరూమ్ను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో వ్యవస్థీకృత ఆభరణాల రిటైల్ను స్టార్ట్ చేశారు.

ఖాజానా యొక్క ప్రధాన ఉద్దేశ్యం నిర్దిష్ట డిజైన్స్ మరియు నాణ్యమైన ఆభరణముల తయారీ. కస్టమర్స్ యొక్క ప్రతి రూపాయికి విలువనిచ్చి వారి అభిమానం పొందగలిగారు. రత్నాన్ని మించి ఒక సమగ్రతగా మారుతుంది.

 • ఫోన్ నెం: 040 23038900
 • ఇమెయిల్: chandanagar@khazanajewellery.com
 • వెబ్సైట్: https://www.khazanajewellery.com
 • చిరునామా: షాప్ నెం 5, చందానగర్, మై హోమ్ జ్యువెల్స్ పక్కన, హైదరాబాద్ – 500 050

 

Totaram & Sons Jewellers Hyd

3. తోటారామ్ & సన్స్ (Totaram & Sons):

వజ్రాలు మరియు ఆభరణాల పట్ల మక్కువతో స్థాపించబడిన తోటారామ్ & సన్స్ జ్యువెలర్స్ అసాధారణమైన వజ్రాలు, బంగారం మరియు రత్నాల సేకరణకు నిలయంగా ఉంది. డిజైన్, క్రాఫ్ట్మ్యాన్షిప్ & సర్వీస్ యొక్క అన్ని కోణాల్లో శ్రేష్ఠత వీరి ప్రత్యేకత.

చక్కటి ఆభరణాలతో అద్భుతమైన విలువను కోరుకునే కస్టమర్లకు ఎంపికలను అందించడంపై దృష్టి సారించిన తోటారామ్ & సన్స్ జ్యువెలర్స్ అత్యుత్తమ డిజైన్లు, అదునాతనమైన మరియు సంప్రదాయ శైలితో కూడిన ఆభరణాల సేకరణను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తాజా మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా విలక్షణమైన బంగారు మరియు వజ్రాల ఆభరణాలను వీరు కస్టమర్స్ కి అందిస్తున్నారు.

 • ఫోన్ నెం: 040 23201137
 • ఇమెయిల్: mail@totaramsons.com
 • వెబ్సైట్: https://totaramsons.com
 • చిరునామా: 35, యూనిటీ హౌస్ ఎదురుగా: గ్రామర్ స్కూల్ అబిడ్స్ రోడ్ హైదరాబాద్

 

Manepally Jewellers Hyderabad

4. మానేపల్లి (Manepally):

5 తరాలకు పైగా విశ్వసనీయమైన పేరు కలిగి హైదరాబాద్ నగరంలో అన్ని రకాల ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీరి వద్ద లభించు నాణ్యమైన వజ్రాలు, ముత్యాలు, రత్నాలు మరియు బంగారు ఆభరణాలు ఎప్పటికీ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నాణ్యమైన ఆభరణాలకు పెట్టింది పేరు. సంప్రదాయబద్దమైన మరియు సమకాలీన డిజైన్ లకు ప్రసిద్ధి చెందిన షోరూం మానేపల్లి జ్యువెలర్స్.

 • ఫోన్ నెం: 9100214666
 • ఇమెయిల్: online@manepally.com
 • వెబ్సైట్: https://manepally.com
 • చిరునామా: మెయిన్ రోడ్, జనరల్ బజార్, సికింద్రాబాద్-500003, తెలంగాణ

 

Shree Jewellers Telangana

5. శ్రీ జ్యుయలర్స్ (Shree):

అధునాతనత మరియు సంప్రదాయ ఆభరణాలు వీరి ప్రత్యేకత. మాస్టర్ ఆఫ్ ఆర్ట్ ద్వారా రూపొందించిన ఆభరణాల సేకరణ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

శ్రీ జ్యువెలర్స్ అందమైన ఆభరణాల పట్ల మక్కువ ఉన్నవారి కళ్లకు శోభను కలిగిస్తుంది. వీరి వజ్రాల ఆభరణాలు మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాయి.

 • ఫోన్ నెం: 04022112211
 • ఇమెయిల్: sj36@shreejewellers.com
 • వెబ్సైట్: https://shreejewellers.com
 • చిరునామా: పెద్దమ్మతల్లి గుడి దగ్గర, రోడ్ నం 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్

 

కృష్ణా జ్యుపెరల్స్

6. కృష్ణా జ్యుపెరల్స్ (Krishna Pearls):

30 సంవత్సరాలనుండి బంగారు ఆభరణల తయారీలో అనుభవం కలిగి ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ లేటెస్ట్ కలెక్షన్ కలిగి వైవిధ్యభరితమైన ఆభరణములను తమ కస్టమర్స్ కు అందిస్తున్నారు.

భారతీయ మరియు అంతర్జాతీయ కస్టమర్లకు వారు కోరిన డిజైన్స్ తయారు చేయడంలో అనుభవంతో కూడిన ఇన్ హౌస్ డిజైనర్లు కావలసిన అభరణాలను తక్కువ సమయంలో అందిస్తారు.

 • ఫోన్ నెం: 8499011111
 • ఇమెయిల్: customercare@krishnapearls.com
 • వెబ్సైట్: https://www.krishnapearls.com
 • చిరునామా: రోడ్ నెంబర్ 36, చెక్ పోస్ట్, జూబిలీ హిల్స్

SBB జ్యువలర్స్

7. SBB జ్యువలర్స్:

మీరు అద్భుతమైన, నాణ్యతమైన ఆభరణాల తయారీ వీరి ప్రత్యేకత. పనితనంలో రాజీలేకుండా అద్భుతమైన బంగారు ఆభరణాలు రూపొందించగలరు.

మీరు ఏ రకమైన ఆభరణాలను వెతుకుతున్నప్పటికీ నాణ్యతకు, మన్నికకు హామీ ఇస్తున్నారు. చూడ చక్కగా ఆభరణాలను డిజైన్ చేస్తారు. కాబట్టి మీరు తప్పక వీరి షాప్ కు విచ్చేయవచ్చు!

 • కాంటాక్ట్ నెం: 09502076000
 • ఇమెయిల్: mail@sbbjewels.com
 • చిరునామా: Suraj Bhan Babulal & Co. Jewellers, బషీర్ బాగ్హై

 

ముజ్తబా జ్యువెలర్స్హై దరాబాద్

8. ముజ్తబా జ్యువెలర్స్ (Mujtaba Jewellers):

1936 నుండి విశ్వసనీయతకు మారు ముజ్తబా జ్యువెలర్స్. వీరు అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉత్తమ నాణ్యత గల ఆభరణాలను అందిస్తున్నారు.

నైపుణ్యం కలిగిన నిపుణులచే నిర్వహించబడుతున్న ముజ్తబా జ్యువెలర్స్ నాణ్యత, నమ్మకం, చక్కదనం మరియు కస్టమర్స్ సంతృప్తిని దృష్టిలో పెట్టుకుని బంగారు, వజ్రాల ఆభరణాలను తయారు చేస్తున్నారు.

 • ఫోన్ నెం: +91 812-100-1100
 • ఇమెయిల్: mujtabahelpdesk@gmail.com
 • వెబ్సైట్: https://mujtabajewellers.com
 • చిరునామా: సరోజినీ ఎయె హాస్పిటల్ రోడ్, హుమాయూన్ నగర్

 

Aabharanam జ్యువెలర్స్హై దరాబాద్

9. ఆభరణం జ్యువెలర్స్ (Aabharanam Jewellers):

ఆభరణం జ్యువలర్స్ అనేది హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక జ్యువెలరీ బోటిక్, దీనిని మమతా రెడ్డి & అనిత రెడ్డి ప్రారంభించారు. వీరి ఆభరణాలు రాజీపడని నాణ్యత మరియు నైపుణ్యంతో ఉంటాయి. కస్టమర్ అవసరాలు మరియు అంచనాలకు సరిపోయేల ఆభరణాలను కూడా డిజైన్ చేస్తారు.

 • ఫోన్ నెం: 91824 86043
 • ఇమెయిల్: info@aabharnamjewellers.com
 • వెబ్సైట్: https://www.aabharanamjewellers.com
 • చిరునామా: VRNN స్ప్లెండర్, రోడ్ నెం 78, ఫిలింనగర్ దగ్గర, జూబ్లీ హిల్స్

 

PMJ జ్యువల్స్

10. PMJ జ్యువల్స్ (PMJ Jewels):

PMJ జ్యువెల్స్ యొక్క మొట్టమొదటి స్టోర్, 1964లో హైదరాబాద్ పాతబస్తీలో ప్రారంభించారు. PMJ జ్యువెల్స్కు పునాది వేసినప్పుడు శ్రీ పి. మనోహర్లాల్ దృష్టి ప్రపంచ స్థాయి ఆభరణాలను ఉత్పత్తి చేయడమే. ఇప్పుడు PMJ జ్యువెల్స్ ఆభరణాల పరిశ్రమలో అర్ధ శతాబ్దానికి పైగా అనుభవం కలిగి, విలువలతో కూడిన బంగారు ఆభరణాలను కస్టమర్స్ కి అందిస్తున్నారు.

PMJ జ్యువెల్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కస్టమర్స్ ని కలిగియున్నారు. అందమైన మరియు ప్రత్యేకమైన డిజైన్స్ తో కూడిన బంగారు, వజ్రాల ఆభరణాల తయారీలో వీరు ప్రత్యేక శైలితో కస్టమర్స్ ని ఆకర్షిస్తున్నారు .

 • ఫోన్ నెం: 80088 86888
 • ఇమెయిల్: onlinehelp@pmjjewels.com
 • వెబ్సైట్: https://www.pmjjewels.com
 • చిరునామా: ఉర్దూ హాల్ లనే, హిమాయత్ నగర్
Share:FacebookX
Join the discussion