హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ Nehru Zoo Park

హైదరాబాద్ ఒక ప్రాచీన నగరం, తెలంగాణ రాజధాని. అతి పురాతనమైన కళా సంపదకు నిదర్శనం ఇక్కడ  ప్రతి రోజు వేలాది సంఖ్యలో యాత్రికుడు వస్తూ ఉంటారు. ఈ అందమైన నగరాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి ప్రతి సంవత్సరం సేద తీరడానికి రావడం జరుగుతుంది.

ఈ నగరానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే వాతావరణం ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా చూడముచ్చటగా ఉంటుంది హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఈరోజు పోటీ పడుతుంది అత్యంత నివాసయోగ్యమైన నగరాలలో ప్రపంచంలో ఇది ఒకటిగా పేరుగాంచింది.

ప్రతి సంవత్సరం విద్యార్థులు వారి యొక్క వేసవి సెలవుల్లో ఇక్కడ గడపడానికి వారి తల్లిదండ్రులతో రావడం జరుగుతుంది ఈ దేశంలోని వారే కాక విదేశాలలోని వారు కూడా రావడం ఇక్కడి కళాసంపదను వీక్షించండి అద్భుతమైన కట్టడాలను పరీక్షించడం ద్వారా ఎనలేని అనుభూతిని పొందుతారు కాబట్టి మనం కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని విశిష్టత గొప్పతనం ఇక్కడి కళా సంపద గురించి ఒక సారి తెలుసుకుందామా అయితే ఆలస్యమెందుకు పదండి.

హైదరాబాద్ నగరంలో ఒక రోజు ఆనందంగా గడపాలని కుంటున్నారా అయితే ఈ నగరం లో మీకు చూడవలసిన అనేక ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవి ఏమిటో తెలుసా బిర్లా మందిరం, సాలార్జంగ్ మ్యూజియం, హుసేన్ సాగర్, గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ.

ఒక్కటేమిటి ఎన్నో కట్టడాలను కనులకు కట్టిపడేసే అందాలను చూడాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నగరానికి రావాల్సిందే అందులో మరీ ముఖ్యంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ ,దీని గురించి మనం తెలుసుకుందామా.

Nehru Zoo Park Hyd

హైదరాబాద్ నుండి 16 కి.మీ దూరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్,హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో 1500 కంటే ఎక్కువ జంతువులు ఉన్నాయి. ఇది 1959 సంవత్సరంలో స్థాపించబడింది మరియు 1963 లో ప్రారంభించబడింది.

నెహ్రూ జూలాజికల్ పార్క్ భారతదేశంలోని అతి పెద్ద జంతుప్రదర్శనశాలలలో ఒకటి మరియు ఇక్కడ మీరు లయన్, రాయల్ బెంగాల్ టైగర్, వైట్ టైగర్, ఖడ్గమృగం మొదలైన అనేక జంతువులను చూడవచ్చు. భారతీయ కోబ్రా, స్టార్ తాబేలు మరియు పెద్ద పెద్ద తాబేలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏనుగు రైడ్ కూడా ఇక్కడ చేయవచ్చు. ఇది కాకుండా, లయన్ సఫారీ పార్క్, పిల్లల కోసం రైలు మరియు సహజ చరిత్ర మ్యూజియం కూడా ఉన్నాయి.

హైదరాబాద్‌లో సందర్శించడానికి అగ్ర ప్రదేశాలలో ఒకటి. అటవీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ జంతుప్రదర్శనశాలకు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు.

నెహ్రూ జూలాజికల్ పార్క్ లొకేషన్, టైమింగ్, క్లోజింగ్ డే మరియు ఎంట్రీ fee గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జూ పార్క్ యొక్క ప్రదేశం:

నెహ్రూ జూలాజికల్ పార్క్ జూ ప్రధాన రహదారిపై ఉంది. ఇది బహదూర్‌పురాలోని కిషన్ బాగ్ సమీపంలో ఉంది. ఈ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో ఉంది, అందువల్ల పార్కు చేరుకోవడం అంత కష్టమైన పని కాదు.

@ NH 44, Bahadurpura, Hyderabad, Telangana 500064

ప్రజా రవాణాలో ప్రయాణిస్తుంటే, హైదరాబాద్ సిటీ బస్ ద్వారా నేరుగా జూ లేదా MMTS కి హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లడం ఉత్తమ మార్గం.

నెహ్రూ జూలాజికల్ పార్క్ యొక్క సమయాలు:

నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ సమయం  ఉదయం 8:00 A.M గంటల నుండి సాయంత్రం 4.30 P.M గంటల వరకు.

Hyd Zoo Park Timings

హైదరాబాద్ జూ పార్క్ సోమవారం మినహా వారంలోని అన్ని రోజులలో తెరిచి ఉంటుంది:

రోజు

సమయం

సోమవారం

08.30 AM to 04:30 PM

మంగళవారం

08.30 AM to 04:30 PM

బుధవారం

08.30 AM to 04:30 PM

గురువారం

08.30 AM to 04:30 PM

శుక్రవారం

08.30 AM to 04:30 PM

శనివారం

08.30 AM to 04:30 PM

ఆదివారం

08.30 AM to 04:30 PM

నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రవేశ రుసుములు (Entry Fee):

 పెద్దలకు (Adults)

50.  రూపాయలు & 60 రూపాయలు వీకెండ్లో

పిల్లలకు (Children’s)

౩౦. రూపాయలు & 40 రూపాయలు వీకెండ్లో (3 నుండి 10 సంవత్సరాలు) 

ఫోటో కెమెరా (Photo Camera) కోసం

100  రూపాయలు

వీడియో కెమెరా (Video Camera) కోసం

500 రూపాయలు

లయన్ & టైగర్ సఫారీ ఫీజు:

పెద్దలకు

50 రూపాయలు

పిల్లలకు

30 రూపాయలు (10 సం”కంటే తక్కువ)

బగ్గీ / బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఫీజు:

పెద్దలకు

60 రూపాయలు

పిల్లలకు

40 రూపాయలు (10 సంవత్సరాల కంటే తక్కువ)

సినిమా షూటింగ్ ఫీజు (Cinema Shooting Fee):

  • సినిమా షూటింగ్‌ల కోసం రోజుకు 8500 ఎంట్రీ ఫీజు
  • సినిమా షూటింగ్ కోసం జనరేటర్ ట్రక్కుల కోసం 1500 రూపాయలు
  • సినిమా షూటింగ్ కోసం జనరేటర్ ట్రక్కుల కోసం 1500 రూపాయలు

జూ గెస్ట్ హౌస్ వసతి రుసుము:

  • 10 మంది సభ్యుల కుటుంబానికి 500 రూపాయలు ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:30 వరకు.

నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతరించిపోతున్నటువంటి పశుపక్ష్యాదులకు కాపాడడమే గాక వారి కోసం ఆహారాన్ని సమకూర్చి పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి పార్క్ లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు, వన్య ప్రాణుల సంరక్షణ కొరకై అటవీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. చేస్తున్నటువంటి కృషి గొప్పదని చెప్పుకోవచ్చు  ఏదేమైనప్పటికీ వన్యప్రాణుల సంరక్షణ అనేది మన కర్తవ్యం కూడా దీనిని మర్చిపోకూడదు live and let live.

సో, ఫ్రెండ్స్ మీకు  ఎప్పుడైనా అవకాశం దొరికితే కచ్చితంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ ను సందర్శించండి ఒక రోజు కాకుండా రెండు రోజులు  కేటాయించినట్లు అయితే  మీ కుటుంబం మొత్తం ఆనందంగా హాయిగా జూ పార్క్ లో గడపవచ్చు. 

తద్వారా బోటింగ్, సఫారీ మరియు సైక్లింగ్ వంటి వివిధ కార్యకలాపాల కోసం మీకు తగినంత సమయం ఉంటుంది. పిల్లలు వారి కోసం సృష్టించబడిన వివిధ వినోదాత్మక ఎంపికలలో కూడా ఎక్కువ సమయం గడపవచ్చు.మీ పిల్లలకి వైల్డ్ లైఫ్ గురించి సరైన అవగాహన కూడా పెంపొందింప చేయవచ్చు.

మరిన్ని వివరాల కోసం విసిట్: https://www.telanganatourism.gov.in

Share:FacebookX
Join the discussion