హైదరాబాదు లో ఆస్తి పన్ను చెల్లించడం ఎలా?

హైదరాబాదు లో ఆస్తి పన్ను చెల్లించడం ఎలా?

ఈనాటి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ప్రజల యొక్క అవసరాన్ని , వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ప్రజలకు అందుతున్నాయి. అవి ఎలా అంటే మంచినీటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, ఆస్పత్రులు, పాఠశాలలు, రవాణా ,,మొదలగునవి అని చెప్పవచ్చు. ఇవన్నీ ప్రభుత్వపరంగా ప్రజల అవసరాల కోసం, సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి.

అయితే వీటిని తీర్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ప్రభుత్వం ప్రజల పైన పన్నులు విధిస్తాయి. అవి ముఖ్యంగా రెండు రకాలు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రజలకు సౌకర్యాలు కల్పించి వారి వద్ద నుండి పన్నుల రూపంలో కొంత మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది దీనినే పన్నుల వ్యవస్థ లేదా  Tax System అంటారు.

ఈనాడు ప్రతి దేశంలో పన్నుల వ్యవస్థ ఉంది కాకపోతే కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. పన్నుల ద్వారానే ప్రభుత్వాలు ఆదాయాన్ని గడిస్థాయి. తద్వారా ప్రజలకు సేవ చేయగలరు.  ప్రజలు బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే  ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా ప్రజలకు సేవలను అందిస్తాయి.

అలాంటి పన్నులలో ఒకటి అయినటువంటి ప్రాపర్టీ టాక్స్ (Property Tax ). ఆస్తిపన్ను తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విషయంలో  చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆస్తి కలిగి ఉన్న వ్యక్తులపై ఆస్తి పన్ను విధించబడుతుంది. ఆస్తి పన్నులు వసూలు చేసే బాధ్యత GHMC (Greater Hyderabad Municipal Corporation) ఉంది.

Property Tax in Telugu

GHMC పరిధిలో ఆస్తి పన్ను ఎందుకు..? ఎలా..? చెల్లించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆస్తిపన్ను (Property Tax) ఎందుకు ముఖ్యం Is It Important to Pay Property Tax?

తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు విధించే అధికారం ఉంటుంది. రిజిస్టర్డ్ ఆస్తి యజమానుల నుండి ఆస్తి పన్ను స్థానిక సంస్థ అయినటువంటి జిహెచ్ఎంసి వసూలు చేస్తోంది. ప్రభుత్వా నికి అతి ప్రధానమైన ఆదాయ వనరులలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. వీటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించడానికి జిహెచ్ఎంసి (GHMC) కృషి చేస్తోంది.

ఆస్తిపన్ను అనేది ప్రతి సంవత్సరం నిర్దిష్టంగా చెల్లించాల్సిందే, అయితే పన్ను చెల్లింపుదారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆస్తి పన్ను చెల్లించే టప్పుడు ఆస్తి ఉన్న ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకనగా ఆ ప్రదేశాన్ని బట్టి చెల్లించాల్సిన స్లాబ్ Slab మారిపోతుంటుంది. కనుక చెల్లింపుదారులు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని చెల్లించాల్సి ఉంటుంది.

కొత్తగా మనమేదైనా ఆస్తిని జిహెచ్ఎంసి (GHMC) పరిధిలో కొనుగోలు చేసినట్లయితే ఆస్తిపన్ను అంచనా కోసం మీ పరిధిలోని GHMC, Deputy Commissioner కు , Sale Deed, Occupancy సర్టిఫికెట్ తో సహా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధించిన ఇన్స్పెక్టర్ లేదా వాల్యుయేషన్ ఆఫీసర్ భౌతికంగా మీ ప్రాపర్టీని తనిఖీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న రేట్ ప్రకారం , మీ ఇంటి నెంబర్ తో ఒక PTIN ( Properly Tax Identification Number) రూపొందిస్తారు.

అయితే PTIN ను ఎలా తెలుసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం:

GHMC Official Website http://www.ghmc.gov.in లోకి login అవ్వండి, PTIN NUMBER తెలుసుకోండి అనే దాని పైన క్లిక్ చేయండి, అక్కడ మీ సర్కిల్ పేరు, మీ పేరు లేదా మీ డోర్ నెంబర్, ఎంటర్ చేయాలి అప్పుడు మీకు 10 సంఖ్యగల PTIN నెంబర్ వస్తుంది.

  • అయితే పైన పేర్కొన్న ప్రాపర్టీ టాక్స్
  • online లోఎలా చెల్లించాలి
  • Offline లో అయితే ఎలా చెల్లించాలి ఇప్పుడు
  • మనం వివరంగా తెలుసుకుందాం

GHMC అధికారిక వెబ్‌సైట్‌: http://www.ghmc.gov.in

Join the discussion