భూకంపాలు (Earthquake) ఎక్కువగా సంభవించే దేశాలేంటో మీకు తెలుసా?

భూకంపాలు  కొన్ని దేశాల్లో ఎక్కువగా వస్తాయి. అందుకు కారణమేంటి, ఎక్కువగా భూకంపాలు వచ్చే దేశాలు గురించి తెలుసుకుందాం.

భూకంపం ఏర్పడినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రకంపనలే కాకుండా భూమి బీటలు వారుతుంది. అందువలన ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తాయి.

భూ ఫలకాల కదలికలే భూకంపం (Earthquake) రావడానికి ప్రధాన కారణం. ఇదే భూప్రకంపణలు సముద్రం లోపలవస్తే సునామీగా మారే అవకాశం ఉంది.

ఈ భూకంపాలను రిక్టర్ స్కేలుతో కొలుస్తారు. భూకంపాలు ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో సంభవిస్తుంటాయి. అందువలన ఈ దేశాలలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే దేశాలేంటో మనం తెలుసుకుందాం.

Earthquake in Japan

1. జపాన్:

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. అందుకే ఈ దేశంలో తరుచూ భూకంపాలు మరియు సునామీలు వస్తుంటాయి. అందువలన భూకంపాలను గుర్తించే ఆధునిక టెక్నాలజీని జపాన్ అభివృద్ధి చేసింది.

భూకంపం  రాబోతుందని తెలియచేసే హెచ్చరిక వ్యవస్థ జపాన్ దగ్గర ఉంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా భూకంపం సంభవించే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోగలుగుతుంది.

Earthquake in Indonesia

2. ఇండోనేషియా:

భూకంపం అనగానే గుర్తుకు వచ్చే దేశం ఇండోనేషియా. ప్రపంచంలో అత్యధిక భూకంపాలకు గురయ్యే దేశం. ఇండోనేషియా  ప్రతి సంవత్సరం ఇంచుమించు 6.0 తీవ్రత కంటే పెద్ద భూకంపాలను చవిచూస్తుంది.

ఈ భూకంపాల వలన ఇండోనేషియా వేలాది మంది ప్రాణాలను, పెద్ద మొత్తంలో ఆస్తులను కోల్పోతుంటుంది.

Earthquake in China

3. చైనా:

భారీ భూకంపాలను చైనాలో కూడా ఎక్కువ. 2008 సంవత్సరంలో సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 7.9 గా రావడం వల్ల సుమారు 87,000 మంది జనాభా మరణించారు. ఈ దేశం టెక్టోనిక్ పలకాల పైన ఉండటం వల్ల ఎక్కువగా భూకంపాలకు గురవుతుంది.

Earthquake in Philipines

4. ఫిలిప్పీన్స్:

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశాల్లో ఇది ఒకటి. అందుకే ఈ దేశం కూడా ఎక్కువగా భూకంపాలకు లోనవుతుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటం.

టైఫూన్లు, మరియు ఉష్ణమండల తుఫానులు సర్వసాధారణం. ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోనేందుకు ఇక్కడి ప్రభుత్వం టెక్నాలజీ పరంగా పలు విధానాలను అవలంభిస్తోంది.

Earthquake in Iran

5. ఇరాన్:

ఇరాన్ దేశంలో కూడా వేలాది మందిని బలిగొన్న వినాశకరమైన భూకంపాల చరిత్ర ఉంది. 1990 సంవత్సరంలో ఇరాన్‌ లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో గిలాన్ ప్రావిన్స్‌లో ఒకటి, ఈ భూకంపం కారణంగా 40,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ దేశాలతోపాటు ఎక్కువగా భూకంపాలకు గురయ్యే దేశాల జాబితాలో ఇటలీ, పెరూ, తుర్కియే, ఈక్వెడార్, యూఎస్ఏ, మెక్సికో దేశాలు ఉన్నాయి.

Share:FacebookX
Join the discussion