హైదరాబాద్ థ్రిల్ సిటీ Hyderabad Thrill City

మన రొటీన్ లైఫ్ లో కావాల్సింది థ్రిల్.మరి థ్రిల్ కావాలంటే వెళ్లాల్సింది థ్రిల్ సిటీ . మన భాగ్యనగరంలో ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. యూత్ అమితంగా ఆకర్షించే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సమీపంలో, మరో అద్భుతమైన పార్క్ చేరింది. అన్ని వర్గాల వారిని అబ్బురపరిచే విధంగా థ్రిల్ సిటీ ని ఆవిష్కరించారు.

థ్రిల్ సిటీ ఎక్కడ ఉంది?

ఇటీవల కాలంలో ప్రారంభమై, హైదరాబాదులోని సంజీవ పార్కు సమీపంలో ఉంది .ఇది నగరం యొక్క మొదటి వర్చువల్ రియాలిటీ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది ఎకరాల 2 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించారు. పార్క్ సందర్శకులు థ్రిల్ సిటీ రైడ్స్ ను, గేమ్స్ ను యాక్సెస్ చేసుకోవడానికి స్మార్ట్ లాయల్టీ కార్డులను, సిలికాన్ రిస్ట్ బ్యాండు లను ఉపయోగిస్తున్నారు.

థ్రిల్ సిటీ సిస్టమ్ కు పవర్ అందించడం కొరకు అత్యుత్తమ శ్రేణి టెక్నాలజీని ఉపయోగించారు. స్పీడ్ రైడ్ ఎంజాయ్ చేసే వారి కోసం మోటార్ సైకిల్ మరియు ఆటోమొబైల్ రేసింగ్ సిమ్యులేటర్లు ,విమానంలో ఎగరాలని కోరుకునే వారికి ఫ్లైట్ సిమ్యులేటర్ లను సెస్నా 172 విమానాన్ని ఉపయోగించడం థ్రిల్ సిటీకి హైలెట్. సాధారణ ప్రజలకు సెస్నా అందించడం ఇదే మొదటిసారి.

ఇవే కాకుండా క్రికెట్ మరియు బౌలింగ్, విశ్రాంతి కోరుకునే వారికి రి ఫ్రేష్మెంట్ స్థలం, బౌలింగ్ రింక్ మరియు ప్రపంచ స్థాయి జిమ్ కూడా ఉన్నాయి.

థ్రిల్ సిటీ నెక్లెస్ రోడ్డులో ఆహ్లాదకరమైన ప్రదేశం. గ్రేటర్ హైదరాబాద్ కు థ్రిల్ సిటీ మణిహారం. మనం సాధారణంగా విదేశాలను సందర్శించడం థ్రిల్ గా భావిస్తాం కదా!మరి ఈ థ్రిల్ సిటీలో సందర్శకులకు వినోదం, థ్రిల్ అంతకు మించి ఉంటుంది. థ్రిల్ ప్రపంచం ఇక్కడ ఉంది. అందులో అద్భుతమైన ఆటలు, మరెన్నో ఉన్నాయి. థ్రిల్ సిటీలో ఉన్న ప్రతి క్షణం మనల్ని థ్రిల్ చేస్తూనే ఉంటుంది.

త్రిల్ సిటీ యొక్క మరిన్ని ప్రత్యేకతలు:

మాన్స్టర్ థియేటర్ (Monster Theater):

అద్భుతమైన అనుభవంతో హైదరాబాదులో ఉన్న భారతదేశపు బిగ్గెస్ట్ మోషన్ థియేటర్. అపారమైన స్క్రీన్, త్రీ D చిత్రాలు, చలన ముద్రలు మరియు వర్షం, వేడి, గాలి, నీరు, ఫ్లాసింగ్ లైట్లు మరియు అదనపు ప్రత్యేక ప్రభావాల అరుదైన కలయిక త్రిల్లింగ్ వాస్తవిక అందిస్తుంది.

స్ప్లాష్ కోస్టర్ (Splash Coaster ):

హైదరాబాద్ లోని థ్రిల్ సిటీలో ఉన్న ఫస్ట్ స్ప్లాష్ కోస్టర్. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. స్ప్లాష్ సమయంలో మనం నగరం యొక్క గోడపైన వీక్షణ అనుభూతి పొందుతాము. ఈ వాస్తవ ప్రపంచం రైడ్ లో మనం భయం, ఆనందం కలయిక గల థ్రిల్ ను ఫీల్ అవుతాము.

ఫ్లైట్ సిమ్యులేటర్ (Flight Simulator):

విమానం ఎగరడం, నిజమైన థ్రిల్ ను అనుభవించడానికి భారతదేశం యొక్క మొదటి పూర్తి -మోషన్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఫర్ ది పబ్లిక్. ఇక్కడ ఎలా టేకాఫ్ చేయాలో, ఎలా ల్యాండ్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ మన విమానం క్రాష్ అయినా పర్లేదు మనం సురక్షితంగా ఉంటాం.

డోమ్ థియేటర్:

హైదరాబాదులో ఉన్న మొదటి పూర్తి డిజిటల్ డోమ్ థియేటర్, స్పేస్ మూవీలు మరియు ఇతర మూవీలను చూడడానికి తయారు చేయబడింది. ఇక్కడ కదలడం, తిరగడం, ఎగరడం వంటి భ్రమ లను కలిగిస్తుంది.

VR రోలర్ కోస్టర్ (VR Roller Coaster):

ఇది హైదరాబాదులో ఏకైక ఇన్వర్టర్ మోషన్ వర్చువల్ రియాలిటీ రోలర్ కోస్టర్. వినోదం, ఆహ్లాదం ,ఆనందం కలిగించే నీటి రైడ్ ….దీనిలో ప్రజలు రైల్లో కూర్చుంటారు. అది నీటి గుండా వెళుతుంది. ఇలా చేయడానికి భయపడే వారి కోసమే VR రోలర్ కోస్టర్ ఉంది.

Dashing కార్:

వర్చువల్ రియాలిటీ మరియు నాన్ వర్చువల్ రియాలిటీలో రియల్ రేసింగ్ ఫీల్ అవుతాము. డ్రైవింగ్ ఎలా? నేర్చుకోవాలి అని అనుకునే వారికి ఇది సరైన కారు. ఇక్కడ మనకు వాస్తవానికి నిజమైన రహదారిపై డ్రైవింగ్ చేసిన భావనను పొందుతాము.

ఇవేకాక , ఫుడ్ స్టాల్స్ భోజన ప్రియులకు ఆహా! అనిపించేలా ఉంటుంది.

ఇంకా, సిగ్నేచర్ గ్రిల్స్, 10డి ఎక్స్ ప్రెస్ , సిగ్నేచర్ గ్రిల్స్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్, హెల్త్ క్లబ్, అంతర్జాతీయ వ్యాయామశాల, ఇండోర్ క్లైమేట్ కంట్రోల్డ్ సిమ్మింగ్ ఫుల్, హెల్త్ బార్, కార్నివాల్ గేమ్స్ మరియు ఫ్యామిలీ రైడ్స్, పిల్లల కోసం భారీ అవుట్ డోర్ గేమ్స్, మ్యూజిక్ ట్రైన్ ఇంకా ఎన్నో, మరెన్నో.

ఇన్ని విషయాలు తెలిసాక, ఒక సారి వెళ్లాలని అనిపిస్తుంది కదూ! ఇంకెందుకు ఆలస్యం ,థ్రిల్ ప్రపంచం ఇక్కడే హైదరాబాద్ థ్రిల్ సిటీ లో ఉంది. పదండి వెళ్దాం.

Share:FacebookX
Join the discussion